‘యూవీ క్రియేషన్స్’ లో మరో సినిమా..!

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తయినా ఇంకా అనుష్క క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈమె ఓ స్టార్ హీరోయిన్. యంగ్ హీరోయిన్లు ఎంతమంది వచ్చినా.. అనుష్క క్రేజ్ వేరనే చెప్పాలి. ‘బాహుబలి2’ తరువాత అనుష్క వేగంగా సినిమాలు చెయ్యడం లేదు అనే కంప్లైంట్ ఉంది. ఆ చిత్రం తర్వాత ఒక్క ‘భాగమతి’ చిత్రంతో మాత్రమే అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిన్నపాటి రోల్ చేసింది. కానీ అది ఆమె అభిమానులను ఫుల్ గా సంతృప్తి పరచలేదని అప్పట్లో చర్చ జరిగింది.

ఇక అనుష్క ప్రస్తుతం.. ‘నిశ్శబ్దం’ చిత్రం చేస్తుంది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తుంది. ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషల్లోనూ ఓ వారం పాటు సినిమాలు లేని డేట్ చూసి విడుదల చెయ్యాలనేది నిర్మాతల ప్లాన్ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత అనుష్క ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో మరో చిత్రం చేయబోతుందనేది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని.. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్ట్ చేయబోతున్నాడని కూడా ప్రచారం నడుస్తుంది. ‘యూవీ క్రియేషన్స్’ లో అనుష్కకు ఇది మూడవ చిత్రం అవుతుంది. గతంలో ఈ వీరితో ‘మిర్చి’ ‘భాగమతి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus