మళ్ళీ బయట పడ్డ ‘మా’ వివాదాలు!

తాజాగా పార్క్ హయత్ హోటల్ లో ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మోహన్ బాబు, సుబ్బిరామిరెడ్డి వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. డైరీ ఆవిష్కరణ ముగిసిన తరువాత.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ” ‘మా’ అసోసియేషన్ లో ఫండ్ రైజ్ చేయడం కోసం అమెరికాలో ఈవెంట్స్ చేశారు. ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారు.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలి. వీటి కోసం రాంచరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి వారిని ముందుకు తీసుకురావాలి. హీరోలు కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా.. వారొక పది కోట్లు చొప్పున ఇవ్వలేరా అని అనుకుంటారు.. కానీ అలా ఇవ్వడం కాదు.. డబ్బులు జెనరేట్ చేయడమనేది ముఖ్యం. ఈ అసోసియేషన్ కోసం ప్రభుత్వం కొంత స్థలం కేటాయిస్తామని కూడా చెప్పింది.. కానీ అదే సమయంలో ‘మా’ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూలు రావడం, ఎలక్షన్స్ వంటివి జరిగాయి.

అందరం కలిసి పని చెయ్యాలి. ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలే కానీ ఎవరికి పేరు వెళ్తుందనేది ముఖ్యం కాదు… ‘మా’కి పేరు తీసుకురావాలి. ‘మా’లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మనలో మనం పరిష్కరించుకుందాం. ‘మా’ గురించి మంచి ఉంటే మైక్ లో చెప్పుకుందాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం. ఒకప్పుడు ‘మా’లో ఇలాంటివి వివాదాలు ఉండేవి కావు.. కానీ ఇప్పుడు వివాదాలు వస్తూనే ఉన్నాయి. అందరం కలిసి ముందుకు వెళ్లే దిశగా ఆలోచించండి.” అంటూ చిరు మాట్లాడుతుండగానే మైక్ తీసుకున్నాడు. ఆయన స్పీచ్ మొదలు పెడుతూనే.. రాజశేఖర్ స్టేజ్ పై ఉన్న అందరి పాదాలకు మొక్కాడు.

“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో పని చేశాను.. ఆ టెన్షన్ లో నాకు కారు యాక్సిడెంట్ కూడా జరిగింది. ‘మా’లో ఉన్న 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు ఉన్నారు. ఈ అసోసియేషన్ లో ఏది సవ్యంగా జరగడం లేదు… అంటూ రాజశేఖర్ మాట్లాడారు. ఆ వెంటనే మైక్ తీసుకున్న చిరు.. ‘నా మాటకి విలువ ఇవ్వలేదు. మాటకి విలువ ఇవ్వనప్పుడు ఇక్కడ మేం ఉండడం ఎందుకు…! రాజశేఖర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. స్టేజ్ పై రాజశేఖర్ మర్యాద లేకుండా ప్రవర్తించారు. ప్లాన్ చేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు.. డిసిప్లైనరీ సిస్టం ఏదైనా ఉంటే గనుక రాజశేఖర్ పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి” అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యరు. ప్రస్తుతం ఈ అంశానికి సంబందించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus