మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. విక్టరీ వెంకటేష్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
వాటిని అనిల్ బ్యాలెన్స్ చేస్తాడు అనే అంతా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పటివరకు ఎటువంటి హిట్ ఇవ్వలేదు టీం. ‘మీసాల పిల్లా’ సాంగ్ లో చిరు- నయన్ భార్యాభర్తలు కానీ విడిపోయారు అన్నట్టు చెప్పారు. దాని వెనుక అసలు కథ ఏంటి అన్నది క్యూరియాసిటీ పెంచే అంశం. ఇది పక్కన పెట్టేస్తే.. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉంటాయట.
ఫైట్స్, చిరు మార్క్ కామెడీ.. వంటివి మాత్రమే కాకుండా స్పెషల్ డాన్స్ నంబర్ కూడా ఉంటుందట. అందులో తమన్నాతో కలిసి చిరు స్టెప్పులు వేయబోతున్నారట. స్పెషల్ సాంగ్స్ లేదా ఐటెం సాంగ్స్ విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ తోపు. ‘డియో డియో’ ‘బాబు ఓ రాంబాబు’ వంటి పాటలు ఇప్పటికీ మర్చిపోలేని రేంజ్లో ఉంటాయి. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలోని స్పెషల్ సాంగ్ కూడా అదే రేంజ్లో ఉంటుందని అంటున్నారు.
ఈ సాంగ్ చిరుకి కూడా బాగా నచ్చడంతోనే ‘విశ్వంభర’ లో కూడా భీమ్స్ తో ఓ స్పెషల్ సాంగ్ చేయించుకున్నారట చిరు. ఇక ‘భోళా శంకర్’ సినిమాలో చిరుతో కలిసి స్టెప్పులేసి అలరించిన తమన్నా.. ‘మనశంకర్ ప్రసాద్’ గారులో కూడా మరోసారి చిరుతో కలిసి టాప్ లేపేందుకు రెడీ అయినట్టు స్పష్టమవుతుంది.