Ram: హాట్ టాపిక్ గా మారిన రామ్ సిక్స్ ప్యాక్ ఫోటో!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇటీవల ‘స్కంద’ అనే సినిమా వచ్చింది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఆ అంచనాలను మ్యాచ్ చేయలేకపోయింది. అయితే రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను అయితే సాధించింది ఈ మూవీ. ఇక ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే మూవీ చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే.

ఆ చిత్రం రామ్ (Ram) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రామ్ మార్కెట్ ను డబుల్ చేసింది. అప్పటివరకు చాక్లెట్ బాయ్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేస్తూ వచ్చిన రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాతి సినిమాలకు కూడా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు కానీ.. ‘స్కంద’ కోసం అతను బరువు పెరగడం జరిగింది.

అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ జిమ్ లో వర్కౌట్లు చేసి సిక్స్ బ్యాక్ బాడీని డెవలప్ చేశాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో అతను షేర్ చేయగా.. కొద్దిసేపటికే అది బాగా వైరల్ అయ్యింది. అతి తక్కువ టైంలో ఇలా స్లిమ్ అవ్వడం అంటే మాటలు కాదు. ‘అందుకు రామ్ ఎన్ని వర్కౌట్లు చేసాడో’ అంటూ నెటిజన్లు అభినందిస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus