త్వరలో కుమారి 21ఎఫ్ కాంబినేషన్ రిపీట్!

చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్. జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ తన మరో తాజా చిత్రానికి శ్రీకారం చుట్టబోతుంది. కుమారి 21ఎఫ్  సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ తాజా చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రంకు మొదటి ఆకర్షణ. కుమారి 21ఎఫ్ విజయంతో తారాజువ్వలా దూసుకెళ్తున్న రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు.

కుమారి 21ఎఫ్ చిత్రంతో  తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకు చిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న కథతో  సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయ ప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే తపనతోనే సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనలు.. ఆయన విభిన్నత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి అందరూ ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలను కోరుకుంటారో ఈ తాజా చిత్రం కూడా అంతకుమించిన కొత్తదనంతో వుండబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus