సరిలేరు నీకెవ్వరు : మహేష్ సూపర్… దేవీ నో చేంజ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ నుండీ ‘ది ఇంట్రో’ అంటూ ఓ వీడియోని విడుదల చేసారు. ఈ వీడియో మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో సాగింది. ‘బ్లాక్ కలర్ నెక్ టీ షర్ట్’ అలాగే మిలిటరీ ఫాంట్ వేసుకుని మహేష్ మంచి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు.

మహేష్ మాత్రమే కాదు ఈ వీడియో మొత్తం మంచి స్టైలిష్ గా ఉంది. స్క్రీన్ అప్పీరెన్స్ విషయంలో మహేష్ ఇరక్కొట్టేస్తాడు అని అందరికి తెలిసిన విషయమే..! సో ఈ ఇంట్రో వీడియోకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. ఏదో మాస్ బీట్ కొట్టెయ్యాలి అని దేవి మళ్ళీ ఆ ‘రొటీన్ రొట్ట బీట్’ నే అందించాడు. ‘మహర్షి’ సినిమా మ్యూజిక్ విషయంలో దేవి ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు మహేష్ ఫ్యాన్స్. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇస్తానని దేవి ప్రామిస్ చేసాడు. కానీ ఈ ఇంట్రో వీడియోతో ‘దేవి ఏమాత్రం మారలేదని’ మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ దేవిని ఓ రేంజ్లో ఆడేసుకున్నారు మహేష్ ఫ్యాన్స్. కనీసం టీజర్, ట్రైలర్ కైనా మంచి ట్యూన్స్ ఇవ్వు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus