Manchu Vishnu, Balakrishna: బాలయ్య ఇంటికి మంచు విష్ణు.. ఎందుకంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా రాజీనామా చేయడంతో రాజీనామాల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజీనామాల గురించి విష్ణు స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నిన్న పెన్షన్ ఫైల్ పై సంతకం చేసిన విష్ణు ఈరోజు తండ్రి మోహన్ బాబుతో బాలకృష్ణను కలిశారు.

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాలకృష్ణతో విష్ణు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాల అంశం గురించి సైతం విష్ణు బాలకృష్ణతో చర్చించాడని సమాచారం. మోహన్ బాబు మాట్లాడుతూ బాలయ్య హుందాతనంతో విష్ణుకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి కలిశానని అన్నారు. విష్ణు మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయనను కలిశానని వెల్లడించారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుస్తానని విష్ణు చెప్పుకొచ్చారు.

ఈ నెల 16వ తేదీన తన ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని విష్ణు వెల్లడించారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కు విష్ణు స్థలాన్ని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం కోసమే ఇండస్ట్రీ పెద్దలను కలిసి ఆహ్వానిస్తున్నానని విష్ణు వెల్లడించారు. అయితే విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత జరుగుతున్న వివాదాలను పరిష్కరించడానికి బాలయ్యను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus