సమంత రిక్వెస్ట్ మేరకు ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పిన చైతన్య…!

చైసామ్… ఈ పెయిర్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వీళ్లిద్దరి వరుస హిట్లు అందుకుంటూ.. అలాగే వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. గతేడాది సమంత ‘ఓ బేబీ’ చిత్రంతో పెద్ద హిట్ అందుకుంది. ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మమెన్స్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ చిత్రంలో సమంత కామెడీ యాంగిల్ ను కూడా బయటకి తీసింది.

ఈ చిత్రం చేస్తున్న టైములో వీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారట. అయితే ఇప్పుడు నందినీ రెడ్డి ఓ కథను సిద్దం చేసుకుందట. అందుకోసం హీరోని వెతికే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సమంత ను కలిసి కథ వినిపించిందట. నందినీ రెడ్డి వినిపించిన కథ.. సమంతకి బాగా నచ్చేసిందట. హీరో కోసం గాలిస్తున్న దర్శకురాలు నందినీ రెడ్డి బాధను చూసి.. సమంత ఆలోచనలో పడిందట. ప్రస్తుతం యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ తరుణంలో తన భర్త చైతన్య కు ఈ విషయం చెప్పి .. హీరోగా చెయ్యమని చెప్పిందట. అయితే మొదట నో చెప్పాడట చైతూ. వరుస సినిమాలతో చైతూ కూడా బిజీగా ఉన్నట్టు తెలిపాడట. అయితే సమంత మళ్ళీ మళ్ళీ అడగడంతో కన్విన్స్ అయ్యాడని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కు చైతన్య ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతన్య ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus