Nagarjuna, Priyamani: 13 ఏళ్ళ తర్వాత రిపీట్ కానున్న ‘రగడ’ కాంబో..!

ఈ మధ్య సీనియర్ హీరోలు హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసేవి కమర్షియల్ సినిమాలు అయితే కనుక యంగ్ హీరోయిన్స్ లో ఎవరొకరిని ఫైనల్ చేసుకుంటున్నారు. లేదు కొంచెం కథాబలం ఉన్న సినిమాలు చేస్తుంటే కనుక సీనియర్ హీరోయిన్స్ తో అయినా కలిసి నటించడానికి రెడీ అయిపోతున్నారు. ఉదాహరణకి చిరంజీవిని తీసుకుంటే ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాల్లో అతనికి హీరోయిన్ లేదు. ‘వాల్తేరు వీరయ్య’ లో మాత్రం శృతి హాసన్ ఉంది. ‘భోళా శంకర్’ లో కూడా తమన్నా అతనికి జోడీగా నటించింది.

ఇప్పుడు ‘విశ్వంభర’ చేస్తున్నారు. అందులో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా చిరు కనిపిస్తారు కాబట్టి త్రిషని ఎంపిక చేసుకున్నారు. గతంలో చిరు సరసన ఆమె ‘స్టాలిన్’ లో నటించింది. ఇప్పుడు నాగార్జున కూడా అంతే. ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణతో కలిసి నటించాడు. ‘ఘోస్ట్’ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ‘నా సామి రంగ’ లో ఆషిక రంగనాథన్ నటించింది.

ఆమె కూడా మిడిల్ ఏజ్డ్ అమ్మాయిగా కనిపించింది. ఇక ఇప్పుడు నాగార్జున.. సుబ్బు అనే దర్శకుడితో ఓ ఆఫ్ బీట్ మూవీ చేయబోతున్నారు. ఇది ఒక కోర్టు డ్రామా అని తెలుస్తుంది. ఇందులో నాగార్జున సరసన ప్రియమైన హీరోయిన్ గా నటించనుందట. గతంలో ప్రియమణి.. ‘రగడ’ సినిమాలో నాగార్జునకి జోడీగా కనిపించింది. అంటే 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగార్జునకి జోడీగా కనిపించనుందన్న మాట.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus