Hero Nani: హీరోలంతా ఒక్కటవ్వాలన్న నాని.. కానీ?

ఏపీ టికెట్ రేట్ల అంశంపై నాని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రులు నాని చేసిన కామెంట్ల గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రి అనిల్ తనకు హీరో నాని ఎవరో తెలియదని చెప్పడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ టికెట్ రేట్ల అంశం గురించి మరోసారి నోరు విప్పారు. సమస్య వచ్చిన సమయంలో హీరోలంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని నాని అన్నారు.

తాను చెప్పింది గోరంత అయితే చెప్పిన మాటలను చీల్చి ఏదేదో చేశారని నాని తెలిపారు. టికెట్ రేట్ల సమస్య నిజంగానే ఉందని సమస్య వచ్చిన సమయంలో అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని నాని చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలంతా ఒక్కటయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని నాని కామెంట్లు చేశారు. నేను చెప్పిన మాటలు తప్పైతే నాకు ఆనందమే అని నాని వెల్లడించారు. వేరేవాళ్లను అవమానించడం తన అభిమతం కాదని నాని చెప్పుకొచ్చారు.

నాన్నకు చిన్న కెఫే స్టోర్ ఉండేదని అందువల్ల తనకు చిన్న దుకాణాల గురించి బాగా తెలుసని నాని అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్ల సమస్య మొదలైన సమయంలోనే అందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించుకుని ఉంటే ఈ విధంగా జరిగేది కాదని నాని పేర్కొన్నారు. హీరోలలో ఐక్యత లేదనే తన అభిప్రాయం తప్పైతే తనకు సంతోషమే అని నాని వెల్లడించారు. మరోవైపు ఏపీలో పలు థియేటర్లను థియేటర్ల యజమానులు స్వచ్చందంగా మూసివేస్తుంటే నిబంధనలు పాటించని థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఏపీ నుంచి ఎక్కువగా కలెక్షన్లు రావడం లేదని సమాచారం. పలు ఏరియాల్లో ఈ సినిమాను నిర్మాత సొంతంగా థియేటర్లలో విడుదల చేశారు. 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే థియేటర్లలో శ్యామ్ సింగరాయ్ మూవీ హిట్ అనిపించుకుంటుందని చెప్పవచ్చు. ఫుల్ రన్ లో శ్యామ్ సింగరాయ్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus