ఆ డైరెక్టర్ ను పక్కన పెట్టి..ఈ స్టార్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..కానీ..!

నితిన్ ఈ ఏడాది ‘చెక్’ ‘రంగ్ దే’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు చిత్రాలకు మంచి స్పందనే లభించింది. కానీ కమర్షియల్ గా ఆ రెండూ వర్కౌట్ కాలేదు. ‘చెక్’ చిత్రం డిజాస్టర్ కాగా ‘రంగ్ దే’ చిత్రం జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. రాంగ్ టైములో విడుదల కావడం వలన ఇలాంటి ఫలితాలు వచ్చాయని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నితిన్.. తాను చెయ్యబోతున్న తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నాడు.

ప్రస్తుతం ‘అంధాదున్’ రీమేక్ అయిన ‘మాస్ట్రో’ లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం నితిన్ సొంత నిర్మాణంలో రూపొందుతోంది. దీని తరువాత కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చెయ్యబోతున్నట్టు నితిన్ గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రానికి రూ.80 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందని.. ఈ ప్రాజెక్టుని నితిన్ పక్కన పెట్టాడు. దీని ప్లేస్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘హార్ట్ ఎటాక్’ అనే చిత్రం వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ నితిన్ కు మంచి హిట్ ఇవ్వాలని భావించి పూరి ఓ కథని సిద్ధం చేసుకుని అప్రోచ్ అయ్యాడట. ‘లైగర్’ పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వినికిడి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus