భీష్మ సినిమా కోసం ఖుషీ కాన్సెప్ట్ ను కాపీ కొట్టేశారు

  • November 7, 2019 / 04:41 PM IST

పవన్ కళ్యాణ్ కి అభిమానులుండరు.. భక్తులు మాత్రమే ఉంటారు అనే విషయం రాజకీయాల్లో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు కానీ.. సినిమాల్లో మాత్రం అది పచ్చి నిజం. “నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్” అని పబ్లిక్ గా చెప్పుకోవడమే కాక తన ప్రతి సినిమాలో ఆయన రిఫరెన్స్ లేదా గెటప్ ను వేసే యువ కథానాయకుడు నితిన్. ఈ అభిమానంతోనే తన తాజా చిత్రం “భీష్మ” విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన “ఖుషీ”ని నమ్ముకొన్నాడు.

“ఖుషీ” సినిమాలో ఎవర్గ్రీన్ నడుము సీన్ కాన్సెప్ట్ ను “భీష్మ” చిత్రంలో రిపీట్ చేశాడు నితిన్. ఈ సినిమాలో రష్మిక నడుము చూడడం కోసం పట్టుకోవడం కోసం ఆఫీస్ లో నితిన్ నానా తంటాలు పడుతుంటాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదానికి ఒక ఫన్నీ సీక్వెన్స్ ఉందట. సినిమాకి ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. మరి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ నితిన్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus