మళ్ళీ తమన్నా పై ఓంకార్ కామెంట్లు..!

‘రాజుగారి గది3’ అంటూ అక్టోబర్ 18న ప్రేక్షకులని అలరించడానికి దర్శకుడు ఓంకార్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. అవికా గౌర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే మొదట ఈ పాత్రకి తమన్నాని ఎంచుకున్నాడు ఓంకార్. కానీ ఎందుకో ఈమె ఆ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. అసలు ఆమె ఎందుకు తప్పుకుంది అనే దాని పై చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఏది నిజం అనేది.. క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఇదే విషయం పై తాజాగా దర్శకుడు ఓంకార్ క్లారిటీ ఇచ్చాడు. ‘రాజుగారి గది3’ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయం పై స్పందించాడు ఓంకార్.

ఓంకార్ మాట్లాడుతూ.. “తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు ఆమెకి లైన్ మాత్రమే చెప్పాము. సినిమా మొదలుకావడానికి కొద్దిరోజుల ముందే ఫుల్ నేరేషన్ ఇచ్చాము. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు. తన పాత్రను మార్చమని, దానికి తగ్గట్లు కథ మార్చాలని అడిగారు. అప్పుడు అంత సమయం లేకపోవడంతో తమన్నాను వద్దనుకొని.. అవికా గౌర్ తో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాము. అయితే అవికా ఎంటరయిన తరువాత హీరోయిన్ పాత్రను మొత్తం మార్చేసి హీరో పాత్రను పెంచాం. సినిమా మొత్తం హీరో మీదే నడిపించాము. దాంతో తమన్నా కోసం అనుకున్న ‘పాయింట్ ఆఫ్ వ్యూ కథ’ అలానే ఉంది. వీలయితే దాన్ని ‘రాజు గారి గది 4’ గా తీసే ఛాన్స్ ఉంది. తమన్నా ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడం వలన మంచే జరిగింది. హీరో రోల్ కి ప్రాముఖ్యత పెరిగి.. సినిమాలో వినోదానికి స్కోప్ పెరిగింది. తమన్నాకి బదులుగా తాప్సీ, కాజల్ ఇలా చాలామందిని ప్రయత్నించాం. అయితే ఎవరి డేట్ లు అందుబాటులో లేకపోవడంతో అవికా గౌర్ ను తీసుకున్నాం. అది కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమా క్లైమాక్స్ మొత్తం అవికా చుట్టూనే తిరుగుతుంటుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus