ఇక నో డిలే.. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..!

‘అల వైకుంఠపురములో’ చిత్రంతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న త్రివిక్రమ్ తన తరువాతి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ల పై రాధాకృష్ణ,కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత కచ్చితంగా ఎన్టీఆర్కు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటే బెటర్ అని.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ క్రమంలో కియారా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లను కూడా సంప్రదించారట. కానీ ఫైనల్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం.

నిజానికి పూజా హెగ్డే ను ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకోవాలని ముందుగానే చర్చించుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ చేసింది పూజ. ఇక త్రివిక్రమ్ తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా చేసింది. అందుకే మొదట పూజ ను లైట్ తీసుకున్నారు ‘ఎన్టీఆర్ 30’ టీం. అయితే ఇప్పుడు బాలీవుడ్లో కూడా పూజా హెగ్డే క్రేజ్ పెరిగింది.. అందుకే ఈమెనే ఫైనల్ చేసారని టాక్ బలంగా వినిపిస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus