సందడంతా ప్రభాస్ – అనుష్కలదే..!

టాలీవుడ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎవరంటే.. టక్కున చెప్పే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. గత కొంతకాలంగా ప్రభాస్, అనుష్కలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో నిజం లేదని ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తూనే ఉంది ఈ జంట. ఇదిలా ఉండగా ప్రభాస్ కి పెళ్ళి కుదిరిందని, భీమవరం అమ్మాయిని ప్రభాస్ పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ మరో వార్త కూడా హల్ – చల్ చేసింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్-అనుష్కల టాపిక్ తెరపైకి వచ్చింది. తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళికి అతిధులుగా విచ్చేసారు ప్రభాస్, అనుష్క.

ఈ పెళ్ళిలో వీరిద్దరూ కలిసి రాజస్థానీ స్టైల్ లో దుస్తులు ధరించి డాన్స్ లు కూడా చేశారట. ఇక ఈ పెళ్ళి వేడుకలో ప్రభాస్,అనుష్కలు బాగా సందడి చేశారట. ఆదివారం రాత్రి జరిగిన పెళ్ళి లో వీరిద్దరూ కలిసి ఒకే చోట కలిసి ఉండడంతో మరోసారి వీరిద్దరి పెళ్ళి పై వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ‘ప్రభానుష్కా’ అనే ‘హాష్ టాగ్’ తో రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు. ఈ ఫోటోలలో ప్రభాస్,అనుష్క … ఇద్దరూ అందంగా ఉన్నారని, త్వరలోనే పెళ్ళి వార్త కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మరి వీటి పై ప్రభాస్, అనుష్కలు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus