Prabhas: అప్పుడంటే ఓకే ఇప్పుడు మరి ఫ్యాన్స్ తట్టుకోగలరా?

టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ మీద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలు చాలా అరుదుగా ఉంటాయి. సిల్వర్ స్క్రీన్ మీద ఆ జంటలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపిస్తూ ఉంటారు. సినిమా కంటేంటీ తో సంబంధం లేకుండ కేవలం ఈ జంటలను వెండితెర పై చూసి సంతృప్తి చెందడానికి వెళ్తూ ఉంటారు ఆడియన్స్. అలాంటి జంటలలో ఒకటి ప్రభాస్ – త్రిష.

వీళ్లిద్దరు మొట్టమొదటిసారి వర్షం అనే చిత్రం లో నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది. ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ జంట కలిసి ‘పౌర్ణమి’ మరియు ‘బుజ్జిగాడు’ వంటి చిత్రాలలో కలిసి నటించారు.

పౌర్ణమి చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవగా, బుజ్జిగాడు చిత్రం యావరేజి గా నిల్చింది. ఈ చిత్రాల తర్వాత మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం మళ్లీ ఈ జంట కలిసి ‘స్పిరిట్’ అనే చిత్రం లో నటించబోతున్నట్టు టాక్. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ ఇప్పటి నుండే మొదలు పెట్టినట్టు సమాచారం.

అందులో భాగంగా త్రిష ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు టాక్. సందీప్ వంగ సినిమాల్లో రొమాన్స్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’ లో ఏ రేంజ్ రొమాన్స్ ఉంటుందో చూసాం. ఇప్పుడు డిసెంబర్ లో విడుదల అవ్వబోతున్న ‘ఎనిమల్’ చిత్రానికి సంబంధించిన టీజర్ లో కూడా రొమాన్స్ వేరే లెవెల్ లో ఉంది. అలాగే స్పిరిట్ చిత్రం లో కూడా అదే రేంజ్ రొమాన్స్ త్రిష మరియు (Prabhas) ప్రభాస్ మధ్య ఉంటుందని అంటున్నారు, చూడాలి మరి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus