Pushpa2: మరోసారి అభిమానులను నిరాశపరిచిన సుకుమార్.. పుష్ప కోసం 2 నిరీక్షణ తప్పదా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన ఆధారాభిమానాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా సీక్వెల్ చిత్రం పట్టాలెక్కలేదు.

అయితే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి అభిమానులకు డైరెక్టర్ సుకుమార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1వ తేదీ ఎంతో ఘనంగా లాంచ్ అయిన అల్లు స్టూడియోస్ లో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున సెట్ నిర్మించి సినిమా షూటింగ్ పనులను ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే తాజా వార్తలు ప్రకారం పుష్ప సినిమా మరో రెండు నెలలు వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సుకుమార్ కారణంగా ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది.సుకుమార్ గారికి వెన్నులో తీవ్రమైన నొప్పి రావడం చేత రెండు నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమైన చెప్పారట. ఈ విధంగా డాక్టర్లు రెండు నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పడంతో మరోసారి పుష్ప 2 మరోసారి వాయిదా పడింది.

ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకుంటుందో తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus