రజినీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనా.. కానీ..?

ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రజినీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. గతేడాది 2 సినిమాలు విడుదల చేసిన రజినీ ఈఏడాది అప్పుడే ‘పేట’ చిత్రాన్ని కూడా విడుదల చేసేసారు. ఇక ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే దర్శకుడు శివ తో కలిసి తన 168 వ చిత్రాన్ని చేయడానికి కూడా రెడీ అవుతున్నారు రజినీ.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సీనియర్ నటి మీనా ని తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సీనియర్ నటి కి ఇంత గోల్డెన్ ఛాన్స్ రజినీ ఎందుకు ఇచ్చినట్టు అనే ప్రచారం కూడా జరుగుతుంది. తన వయసుకి తగ్గ హీరోయిన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే రజినీ.. మీనా ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఓ నెగిటివ్ పాత్ర కూడా ఉందని… అందుకే మీనాని తీసుకున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ టాక్ లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది. ఇక గతంలో ‘ముత్తు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో రజినీ కి జోడీగా మీనా నటించిన సంగతి తెలిసిందే.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus