ఆర్.ఆర్.ఆర్ నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మోస్ట్ హైప్డ్ సినిమా “ఆర్.ఆర్.ఆర్”. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ఆలియా భట్ కథానాయికగా నటిస్తుండగా.. అజయ్ దేవగణ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ జూలై 30, 2020లో విడుదల చేస్తానని రాజమౌళి బాహుబలి రేంజ్ లో ప్రతిజ్ణ చేసినప్పటికీ.. ఎందుకో కానీ మొదటి నుండి ఈ ప్రొజెక్ట్ కి అన్నీ అడ్డంకులే. షూటింగ్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే కాలికి తగిలిన దెబ్బ కారణంగా చరణ్ షూటింగ్ కి దూరమైతే.. ఆ తర్వాత చేతికి గాయమై ఎన్టీఆర్ గ్యాప్ ఇచ్చాడు. రాజమౌళి మాత్రం ఈ గ్యాప్ లో మైనర్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడనుకోండి.

అయితే.. ఈ ఏడాది అక్టోబర్ లో “సైరా నరసింహారెడ్డి” విడుదలకు రెడీ అవుతుండడంతో ఆ చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ “ఆర్.ఆర్.ఆర్” నుంచి ఒక నెల గ్యాప్ తీసుకొనే అవకాశం ఉందట. అందుకు కారణం “సైరా”ను ప్రమోషన్స్. సినిమా మొదలైన్ చాన్నాళ్ళైపోవడంతో.. సినిమాకి ఉన్న క్రేజ్ మెల్లమెల్లగా కోల్పోతూ వచ్చింది. సో, ఆ క్రేజ్ ను మళ్ళీ తీసుకురావాలంటే చిరంజీవితోపాటు చరణ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వాలి. ఇదంతా బాగానే ఉన్నా.. ‘ఆర్.ఆర్.ఆర్”కి ఇలా బ్రేకులిచ్చుకుంటూ వెళ్తే ఆ సినిమా ఎప్పటికీ పూర్తవుతుందా అని జనాలు భయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus