ఆ డైరెక్టర్ పై రవితేజకు అంత నమ్మకం ఏంటి?

రవితేజ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని… ఇప్పటికే అతను చేసిన సినిమాలు ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది విడుదలైన ‘డిస్కో రాజా’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ అనే సినిమా చేశాడు రవితేజ. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ‘క్రాక్’ యూనిట్ అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బలుపు’ కాంబినేషన్ కాబట్టి.. ‘క్రాక్’ పై అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. అయితే వైరస్ మహమ్మారి ఈ చిత్రం విడుదల కాకుండా చేసింది.

ఫైనల్ షెడ్యూల్ ఒకటి బ్యాలన్స్ ఉంది. ఓటిటిలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యమని భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ.. ‘క్రాక్’ యూనిట్ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని తేల్చి చెప్పేసింది.ఇదిలా ఉండగా.. దర్శకుడు గోపీచంద్ మలినేని గత చిత్రం ‘విన్నర్’ ఫ్లాప్ అన్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తరువాత మరో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి రవితేజ ఓకే చెప్పాడట. అందుతోన్న సమాచారం ప్రకారం.. విఐ ఆనంద్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రవితేజ ఓకే చెప్పాడని తెలుస్తుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.

అయినప్పటికీ ఈ డైరెక్టర్ తో మరో సినిమా చెయ్యడానికి రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.ఈ మధ్యనే విఐ ఆనంద్.. రవితేజ కు ఫోన్ చేసి ఓ లైన్ వినిపించాడట. అది నచ్చడంతో వీడియో కాల్ చేసి కథ మొత్తం వినిపించమని రవితేజ.. ఆనంద్ ను కోరాడట. మొత్తం కథ విన్నాక ఈ చిత్రాన్ని కచ్చితంగా చేద్దాం అని రవితేజ.. దర్శకుడు ఆనంద్ కు చెప్పాడని తెలుస్తుంది. మరి ఈసారైనా వీరిద్దరూ కలిసి ఓ మంచి హిట్ ఇస్తారేమో చూడాలి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus