Ravi Teja: స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆ రికార్డును సొంతం చేసుకుంటారా?

స్టార్ హీరో రవితేజ టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడం గమనార్హం. ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

అయితే వీరసింహారెడ్డి సినిమా హిట్టైనా గోపీచంద్ మలినేని కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఐతే రాలేదు. అయితే రవితేజతో గోపీచంద్ మలినేని మూవీ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కాగా ఈ కాంబోలో క్రాక్ కు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని బోగట్టా. త్వరలో ఈ కాంబోలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

రవితేజ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం. రవితేజ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తున్నారు. కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడంలో తప్పు లేకపోయినా కథ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఛాన్స్ ఇస్తే మంచిదని చెప్పవచ్చు. మాస్ మహారాజ్ రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

రవితేజకు (Ravi Teja) తాజాగా రావణాసుర మూవీతో భారీ షాక్ తగిలింది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని తర్వాత సినిమాతో కూడా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus