ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలో చిన్న నెగెటివ్ షేడ్ ఉంటుంది. అతని పాత సినిమాలు మనం పెద్దగా చూడకపోవచ్చు కానీ.. ‘కేజీఎఫ్’ చూస్తే కచ్చితంగా అర్థమైపోతుంది. అలా అని అది నెగెటివ్ రోల్ అని కూడా చెప్పలేం. హీరో ఒకానొక సమయంలో కాస్త నెగెటివ్‌గా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు ‘సలార్’లో ప్రభాస్ అలా కనిపిస్తాడని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ పాత్రను రాసుకున్నప్పుడే ఈ షేడ్‌ను సెట్ చేసి పెట్టుకున్నాడట. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే టాక్.
‘సలార్’ పోస్టర్‌లో ప్రభాస్‌ను చూస్తే… చిన్న గ్రే షేడ్ కనిపిస్తుంది. అంటే పోస్టర్‌లో ఉండే షేడ్ కాదు. ప్రభాస్ ముఖంలో ఉండే షేడ్. అయితే ప్రశాంత్ నీల్ పోస్టర్లు అలానే ఉంటాయి అని అందరూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కొన్నాళ్లు షూటింగ్ అయిపోయాక చూస్తే ముందు వచ్చిన డౌటే కరెక్ట్ అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో ప్రభాస్‌లోని నెగెటివ్ షేడ్‌ను చూపిస్తారట. అయితే ఇక్కడే ఇంకో డౌట్ కూడా కొడుతోంది. అసలు అది డబుల్ షేడా లేక డబుల్ రోలా అని.
‘సలార్’ షూట్ మొదలైన తొలి రోజుల్లోనే వినిపించిన మరో పుకారు ‘ఈ సినిమా ఉగ్రమ్‌కి రీమేక్’ అని. ప్రశాంత్ నీల్ కన్నడలో డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. అందులో హీరో ఫ్లాష్‌బ్యాక్‌లో పెద్ద డాన్‌లా కనిపిస్తాడు. అందులోనూ చిన్న నెగెటివ్ షేడ్ కనిపిస్తుంది. అంటే ‘సలార్’సినిమా.. ‘ఉగ్రమ్’ రీమేకేనా. ఇక్కడే మరో విషయం గమనించాలి. ఈ సినిమా సంగీత దర్శకుడు రవి బస్రూస్ గతంలో చేసిన కామెంట్. ‘పాత సినిమా రీమేక్ చేస్తే ఏముంది అందులో కచ్చితంగా ప్రశాంత్ మార్క్ ఉంటుంది’ అని రవి అన్నాడు. సో అదన్నమాట సంగతి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!