Pawan Kalyan, Sagar: సాగర్ కు పవన్ మరో ఛాన్స్ ఇవ్వనున్నారా?

  • March 2, 2022 / 06:49 PM IST

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ తమకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లకు మరో ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో సాగర్ కె చంద్ర పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ ఇచ్చారు. 5 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. మరో 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నా భీమ్లా నాయక్ మూవీ హవా మాత్రం కొనసాగుతోంది.

అయితే త్వరలో భీమ్లా నాయక్ కాంబో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమా కోసం దర్శకునిగా సాగర్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లకు పవన్ కళ్యాణ్ గతంలో కూడా మరో ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది.

సాగర్ కె చంద్ర తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడంతో అతని అభిమానులు సంతోషిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. అయితే యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా చాలా మంచి సినిమా అని కామెంట్లు చేశారు. సాగర్ కె చంద్రకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండగా ఏ హీరోతో సాగర్ ముందుకెళతారో చూడాల్సి ఉంది.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు సాగర్ కె చంద్రకు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు ఇస్తున్నారని సమాచారం అందుతోంది. భీమ్లా నాయక్ సక్సెస్ తర్వాత సాగర్ కె చంద్ర రెమ్యునరేషన్ కూడా పెరిగిందని తెలుస్తోంది. సినిమాసినిమాకు సాగర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus