Pawan Kalyan, Samantha: పవన్ మూవీకి సమంత ఓకే చెబుతుందా..?

Advertisement

పవన్ కళ్యాణ్ సమంత హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ సినిమా మినహా పవన్, సమంత మరో సినిమాలో కలిసి నటించలేదు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని సమాచారం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సమంతను తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత సమంత పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరోయిన్లలో సమంత ఒకరు. అయితే సమంత పవన్ సినిమాకు ఓకే చెబుతారో నో చెబుతారో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం మినహా మరే సినిమాలో నటించలేదు.

గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుండటం వల్ల కాల్షీట్స్ సమస్య వచ్చే అవకాశాలు అయితే లేవు. పవన్ సమంత కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో పవన్, సమంత జోడీగా మరో సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus