ఆ సీక్వెల్ కు సమంత ఒప్పుకుంటుందా?

2018 లో వచ్చిన విశాల్ ‘అభిమన్యుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఈ చిత్రానికి సీక్వెల్ కి తీయడానికి కూడా ఆ టీం రెడీ అయ్యిందట. అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఆనంద్ తెరకెక్కిస్తాడని తెలుస్తుంది. ‘అభిమన్యుడు’ ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ మిత్రన్ హీరో శివ కార్తికేయన్ కు కమిట్ కావడంతో విశాల్ ఆనంద్ ను తీసుకున్నాడట. ఈ చిత్రంలో కూడా విలన్ పాత్రలో అర్జునే కనిపిస్తాడని తెలిసింది.

‘సైబర్ క్రైమ్’ ను ఓ మిలిటరీ ఆఫీసర్ ఎలా అరికట్టాడు అనేది కథాంశం. అయితే పద్మవ్యూహం ఇంకా మిగిలే ఉందని చివర్లో విలన్ చెబుతాడు. సో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే అనుకున్నారు. అయితే ఈ చిత్రంలో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇప్పటికే తన ఎంగేజ్మెంట్ రీత్యా హైదరాబాద్ వచ్చినప్పుడు సమంతను కలిసి సీక్వెల్ విషయం చెప్పాడట విశాల్. అయితే సమంత ఇప్పటి వరకూ ‘ఎస్’ చెప్పలేదంట. దీంతో ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది. మరి సమంత ఈ సీక్వెల్ కు ఒప్పుకుంటుందా..? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus