Sreeleela: ఇక హీరోయిన్ గా అవకాశాలు రావడం కష్టమే అంటున్న నెటిజన్లు..!

ప్రస్తుతం సాధారణ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు జపిస్తున్న పేరు శ్రీలీల . గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ అమ్మడు. దాదాపు మరో రెండేళ్ల వరకు ఖాళీ లేకుండా కాల్షీట్లు ఫుల్ గా నింపేసుకుంది. పేరు అచ్చ తెలుగందం అయినా బెంగుళూరులో పుట్టి.. విదేశాల్లో చదువుకుని తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన గ్లామర్ తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది.

ప్రేక్షకులు కూడా తన గ్లామర్ కు ముగ్ధులు అయిపోయి మరో సారి.. ఇంకొక్క సారి అంటూ వెండి తెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారి కోరిక ఇక పై నెరవేరక పోవచ్చు. ఏంటి ఇంత షాకిచ్చారని అనుకుంటున్నారా.. అదేందో చూద్దాం. ఎందుకో తెలియదు కానీ.. ఈ ముద్దుగుమ్మ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంటిమెంటల్ రోల్స్ ని చూస్ చేసుకుంటుంది. ఇటీవల బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి సినిమాలో చాలా ట్రెడిషినల్ సెంటిమెంటల్ పాత్రలో నటించి మెప్పించింది.

మరోసారి అదేవిధంగా కూతురు పాత్రలో కనిపించబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో కాదట.. తన సొంత గడ్డ అయిన కన్నడ ఇండస్ట్రీలో. ఆమె ఫుల్ లెన్త్ సెంటిమెంట్ సినిమాలో నటించబోతుందట. అయితే ఈ సినిమాలో శ్రీలీల పాత్ర చచ్చిపోతుందట. ఆమెను రౌడీలు రేప్ చేసి యాక్సిడెంట్ చేసి చంపేస్తారట.

ఆమె కోసం తన తండ్రి ఎలా న్యాయం కోసం పోరాడుతాడు అనేదే అసలు స్టోరీ. ఇలా బ్యాక్ టు బ్యాక్ ట్రెడిషనల్ గా సెంటిమెంటల్ పాత్రలో కనిపిస్తే జనాలు ఎలా తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ పాత్రలకే పరిమితమై హీరోయిన్ గా అవకాశాలు రావని నెటిజన్స్ శ్రీలీలకు (Sreeleela) సలహాలు ఇస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus