Tamannaah: బోల్డ్ సీన్స్ చేయడంపై స్పందించిన నటి తమన్న.. ఏమన్నారంటే?

టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో తమన్న సినిమాలు వెబ్ సిరీస్లో కనుక చూస్తే కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా తమన్నా లిప్ లాక్ సన్నివేశాలతో పాటు మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

అయితే ప్రస్తుతం ఈమె (Tamannaah) నటించిన జైలర్, భోళా శంకర్ సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒకరోజు వ్యవధిలోని ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా మరోసారి ఈమెకు ఇలాంటి బోల్డ్ సన్నివేశాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విధంగా తమన్న ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కొన్నిసార్లు మన పరిధిలు దాటి నటించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇలాంటి సమయంలో మనం కాస్త బ్రాడ్ గా ఆలోచించాలని తెలిపారు. తాను ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలలో నటించకపోతే తనకు స్టార్ హీరోల సినిమాలలో వదిన అక్క పాత్రలలో నటించే అవకాశాలను ఇస్తూ తనని ఆంటీని చేసేవారు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఇలాంటి సన్నివేశాలలో నటిస్తేనే హీరోయిన్గా కొన్నిసార్లు అవకాశాలు వస్తాయని లేకపోతే ఆంటీ పాత్రలలో నటించాల్సి వస్తుంది అంటూ ఈ సందర్భంగా తమన్న చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవకాశాల కోసమే తమన్న ఇలా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కాగా భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus