Chiranjeevi, Trisha: చిరంజీవి కొత్త సినిమాలో త్రిష.. ఆల్‌మోస్ట్‌ ఓకే అంటున్నారు.. ఏ సినిమా అంటే?

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు అందరితో నటించిన సీనియర్‌ హీరోయిన్ల లిస్ట్‌ రాస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు త్రిష. టాలీవుడ్‌లో తన అందం, నటనతో కొన్నేళ్లు ఏలిన త్రిష.. ఆ తర్వాత నెమ్మదించింది. కుర్ర హీరోయిన్ల రాకతో సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో టాలీవుడ్‌కి దూరమై తమిళనాట మాత్రమే కనిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు త్రిష.. రీఎంట్రీకి సిద్ధమైంది. పూర్వపు జోరును ప్రదర్శించడానికి ప్లాన్స్‌ వేస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఫ్యాన్స్‌కి గుండెల్లో గుబులు రేగుతోంది అని చెప్పాలి.

త్రిష రీఎంట్రీకి, చిరంజీవి ఫ్యాన్స్‌ గుబులుకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ‘స్టాలిన్‌’ సినిమా గుర్తుకు తెచ్చుకుంటే సగటు సినిమా అభిమానికి కూడా ఆ భయం తెలుస్తుంది. చిరంజీవి – మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టాలిన్‌’ సినిమా బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితం అందుకుంది. దానికి చాలా కారణాలున్నాయి. అయితే అందులో త్రిష – చిరు జోడీ కూడా ఒకటి. ఇద్దరి పెయిర్‌ అంత ఆకట్టుకునేలా లేదనేది ఫ్యాన్స్‌ అప్పటి మాట.

ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఆ పెయిర్‌ మళ్లీ కలుస్తున్నారనే వార్తలు వచ్చేసరికి సెంటిమెంట్స్‌ పట్టించుకునే ఫ్యాన్స్‌కి భయమేస్తోంది. చిరంజీవి – కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌ కాకపోయినా… త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలో నాయిక పాత్ర కోసం త్రిషను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. దీంతోనే ఈ భయం మొదలైంది.

త్రిష అందం మీద, నటన మీద, లుక్స్‌ మీద ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇద్దరి కాంబినేషన్‌ స్క్రీన్‌ మీద ఓకేనా అనేది భయం. అయితే కల్యాణ్‌ కృష్ణ ఈ కాంబినేషన్‌ను చక్కగా చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త మాత్రం ఆనందాన్నిచ్చేదే. అన్నట్లు ఈ సినిమాలో చిరంజీవి తనయుడిగా సిద్ధూ జొన్నలగడ్డ కనిపిస్తాడట. ఆయనకు పెయిర్‌గా శ్రీలీల నటిస్తోంది అని చెబుతున్నారు. ఆ లెక్కన త్రిషకు కూతురు వరుసలో శ్రీలీల నటిస్తోంది అన్నమాట. ఇక ఈ సినిమా నిర్మాత చిరు తనయ సుస్మిత అని సమాచారం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus