స్టాలిన్ జోడీ అప్పట్లో బాలేదు కానీ.. ఇప్పుడు పర్లేదు

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 152వ చిత్రంలో కథానాయిక ఎవరు అనే విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఇప్పటివరకు క్లియర్ అవ్వకపోవడం తెలిసిందే. ఇలియానా, నయనతార, పరిణీతి చోప్రా, విద్యాబాలన్ ల పేర్లు వినబడినప్పటికీ.. వాళ్ళెవరూ కాదని తెలిసిపోయింది. అయితే.. మొదట్లో ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించే అవకాశం ఉందని వచ్చిన వార్తలే ఇప్పుడు నిజమవుతున్నాయి.

నిజానికి 2006లో వచ్చిన స్టాలిన్ సినిమాలోనే చిరంజీవి-త్రిష జంటగా నటించారు. కానీ.. అప్పట్లో త్రిష చాలా చిన్నపిల్ల కావడంతో.. ఇద్దరి కాంబినేషన్ పై అప్పట్లోనే భారీగా ట్రోలింగ్ జరిగింది. కానీ.. ఇప్పుడు త్రిష కూడా 30+ కాబట్టి.. విజయ్ సేతుపతి పక్కనే “96” చిత్రంలో సరిపోయింది కాబట్టి.. ఇప్పుడు చిరంజీవి పక్కన నటించడం అనేది పెద్ద విషయమేమీ కాదు. పైగా చిరంజీవి కూడా సన్నబడి.. ఇప్పుడు మంచి గ్లామరస్ గా కనిపిస్తున్నాడు కాబట్టి.. చిరంజీవి-త్రిషల కాంబినేషన్ ఇప్పుడు బాగానే ఉంటుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus