మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా త్రిష?

“సైరా నరసింహారెడ్డి” విడుదల ఫీవర్ లో ఆడియన్స్ బిజీగా ఉంటే.. చిరంజీవి 152వ సినిమా కోసం ప్రీప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు కొరటాల శివ. “మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను” చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకొన్న కొరటాల తన మునుపటి సినిమాలకంటే పెద్ద హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు. అన్నీ సెట్ అవుతున్నా.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు శివ. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా నయనతారను ఫైనల్ చేసినప్పటికీ.. ఆమె డేట్స్ దొరక్కపోవడంతో ఆమె స్థానంలో బాలీవుడ్ భామను తీసుకోవాలనుకున్నాడు. వాళ్ళ బడ్జెట్ రిక్వైర్ మెంట్ మరీ ఎక్కువగా ఉండడంతో మధ్యలో ఇలియానా పేరు కూడా వినిపించింది. ఆమె మరీ ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్ అని జనాలు గోల పెట్టడంతో ప్రస్తుతం త్రిషను తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారు.

నటిగా “96” సినిమాతో తన ఉనికిని ఘనంగా చాటుకున్న త్రిషను కథానాయికగా తీసుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ఇదివరకూ చిరు-త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన “స్టాలిన్” సెంటిమెంట్ మళ్ళీ ఈ కొత్త సినిమాకి ఎక్కడ రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు మెగా అభిమానులు. మరి ఈ విషయంలో కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటాడో చూడాలి.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus