‘వెంకీమామ’ రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా?

అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ.. ‘వెంకీమామ’ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేయాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం విడుదల వాయిదా పడనుందని తెలుస్తుంది. ‘పవర్’ ఫేమ్ కె.ఎస్.రవీంద్ర( బాబీ) ఈ చిత్రానికి దర్శకుడు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థల పై ఈ చిత్రం నిర్మితమవుతుంది.

నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన నాగచైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి.. దీని పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. విడుదల చేసిన పాటలకి, టీజర్లకు మంచి స్పందన లభించింది. దీంతో అటు దగ్గుబాటి, అక్కినేని అభిమానులతో పాటు మిగిలిన హీరోల అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి 45 కోట్ల వరకూ నిర్మాతలు బడ్జెట్ పెట్టారట. దీంతో ఈ బడ్జెట్ మొత్తం రికవరీ కావాలంటే సోలో రిలీజ్ కావాలి. అందుకే డిసెంబర్ 24 లేదా 25 న విడుదల చేస్తే 2020 సంక్రాంతి వరకూ క్యాష్ చేసుకోవచ్చు అని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈసారైనా నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి..!

ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus