VV Vinayak,Ravi Teja: వినాయక్ తో రవితేజ మూవీ.. ఇది పర్ఫెక్ట్

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఇప్పుడు ఒక హిట్టు, మూడు ఫ్లాప్ లు అన్నట్టు సాగుతుంది. క్రాక్ తో హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు చేశాడు. అవి ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. ధమాకా సినిమా హిట్ అయినప్పటికీ అది శ్రీలీల , పాటలు వల్ల హిట్ అయ్యింది అనే వాదన ఉంది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరంజీవి- బాబీ అకౌంట్లో పడిపోయింది.

ఇక రావణాసుర రిజల్ట్ సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద పెర్ఫార్మ్ చేయడం లేదు. ఈ సినిమా మీద రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. నార్త్ లో అయితే ఈ మూవీని తెగ ప్రమోట్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని అర్దం చేసుకుంటే.. రవితేజ కి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే కలిసి రావడం లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రవితేజ (Ravi Teja) బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్ కూడా అతని సినిమాల్లో ఉండటం లేదు అనే కంప్లైంట్ ఉంది. అందుకే ఇప్పుడు మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వినాయక్ కూడా ఈ మధ్య ఫామ్లో లేడు. అయినప్పటికీ వినాయక్ ఫాలోయింగ్ తగ్గలేదు. అందులోనూ గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన కృష్ణ పెద్ద హిట్ అయ్యింది. కాబట్టి ఆ క్రేజ్ తో అయినా వీరి కాంబినేషన్లో వచ్చే మూవీకి ఏర్పడుతుంది. చూడాలి మరి..!

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus