ఈ స్టార్లు వెనక్కి తగ్గేలా లేరే!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. అలానే ఏపీలో టికెట్ రేట్లపై రగడ జరుగుతూనే ఉంది. ఈ కారణాలతో టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లు పోస్ట్ ఫోన్ అవుతున్నాయి. ఇప్పటికే ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ‘ఆచార్య’ సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ కారణంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఏ ఒక్క పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ లు వేయడం లేదు.

కానీ నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజలు మాత్రం తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ’, రవితేజ నటిస్తోన్న ‘ఖిలాడి’ సినిమాలు మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వరుసగా సినిమాలన్నీ వాయిదా పడుతుండడంతో ఈ సినిమాలను కూడా వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడి’ సినిమా టీజర్ లో, అలానే ‘అఖండ’ టీజర్ లలో సినిమా రిలీజ్ డేట్ లను వెల్లడించారు. రెండూ కూడా మే 28న రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ ఇద్దరు స్టార్లు కూడా ఒకే డేట్ కోసం పోటీ పడతారా..? లేక కరోనా సెకండ్ వేవ్ కారణంగా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే రిలీజ్ డేట్ కి తగ్గట్లుగానే పనులన్నీ పూర్తి చేస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే రవితేజ ‘క్రాక్’ లాంటి భారీ హిట్ తరువాత నటిస్తోన్న సినిమా కావడంతో ‘ఖిలాడి’పై హైప్ క్రియేట్ అయింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus