Dil Raju, Warangal Srinivas: అతడ్ని కాదని దిల్ రాజుకి ఇచ్చేశారట!

Ad not loaded.

గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ఈ సినిమా నుండి జ్వాలా రెడ్డి అనే పాటను కూడా విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ కి ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. నైజాం ఏరియాను మంచి ఫ్యాన్సీ రేటుకి వరంగల్ శ్రీను తీసుకున్నారు. అలానే చాలా ప్రాంతాల్లో బిజినెస్ జరిగిపోయింది.

‘వకీల్ సాబ్’ సినిమా అడ్డుగా రావడం.. సెకండ్ వేవ్ వంటి కారణాలతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో సినిమాను ఓటీటీకి ఇచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. దాని కోసం నైజాం ఏరియాను వరంగల్ శ్రీను నుండి వెనక్కి తీసుకున్నారు. ఓటీటీకి వెళ్తుంది కాబట్టి.. ఎన్ ఓ సీ ఇచ్చేయక తప్పలేదు. కానీ కట్ చేస్తే ఇప్పడు ఓటీటీ ఆలోచనలను పక్కన పెట్టి నైజాం ఏరియాను దిల్ రాజు చేతిలో పెట్టారు. నైజాంలో దిల్ రాజుకి వరంగల్ శ్రీనుకి పడదనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా తన దగ్గర నుండి సినిమా హక్కులను తీసుకొని.. దిల్ రాజు చేతిలో పెట్టడంతో వరంగల్ శ్రీను షాకయ్యారు. నిజంగా ఓటీటీకి ఇచ్చే ప్రయత్నంలో తన దగ్గర నుండి రైట్స్ తీసేసుకున్నారా..? లేక దిల్ రాజుకి ఇవ్వడం కోసం ఓటీటీ రీజన్ చెప్పారా అనే విషయంలో ఆరా తీస్తున్నారు వరంగల్ శ్రీను.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus