ఉగాది సందర్భంగా ‘వన్ బై టు’ ట్రైలర్ విడుదల

డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్నారు. శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపద్యంలో తాజాగా “వన్ బై టు” చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Click Here To Watch NOW

వన్ బై టు ట్రైలర్ స్టార్టింగ్ లో హీరోయిన్ శ్రీపల్లవి క్యూట్ లుక్స్ తో అలరించటమే కాకుండా చివరిలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది, సాయికుమార్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఎవరైనా మహిళల పై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రి గా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు, కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీప్రసాద్ కనిపించారు, విజయ భారతి రాసిన ” నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని” లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. డి.ఎస్.రావ్, యోగికత్రీ కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించారు, ఈ ట్రైలర్ ని “జెపి” చాలా షార్ప్ గా కట్ చేశారు.

దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ ఇది ఒక వైలెంట్ లవ్ స్టొరీ సహజంగా ప్రేమకథా చిత్రాల్లో ఉండే కాన్ఫ్లిక్ట్ కి భిన్నమైన పాయింట్ ని మొదటిసారిగా ఈ సినిమాలో చర్చించాం, నిర్మాత కరణం శ్రీనివాసరావు గారు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామరావు పామరాజు గారు నిర్వహణలో మంచి క్యాలీటితో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది, ఏప్రియల్ మూడో వారంలో ఈ వన్ బై టూ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

“వన్ బై టు” సినిమా మంచి బడ్జెట్ తో రిచ్ గా రూపొందించారని తెలుస్తోంది, దీనికి లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ కంపోజ్ చేయగా… సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్ శంకర్ కేసరి అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కపిల్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి స్టెప్స్ కంపోజ్ చేయగా, శంకర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “వన్ బై టు” చిత్రం ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకి కో-ప్రొడ్యూసర్ – వెంకట రమణ పసుపులేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామారావు పామరాజు, మ్యూజిక్ – లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి,బ్యాక్గ్రౌండ్ స్కోర్ – సందీప్ కుమార్ కానుగల, డైలాగ్స్ – విజయ భారతి, కెమెరా – శంకర్ కేసరి, ఎడిటర్ – JP, లిరిక్స్ – బాలవర్ధన్ & స్వర్ణ నాయుడు, డాన్స్ – కపిల్, ఫైట్స్ – శంకర్. పబ్లిసిటీ డిజైనర్ – శ్రీకాంత్

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus