నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ మరో వారం రోజుల్లో విడుదల కానుంది. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉండటంతో లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో చైతన్య సినిమాలు హిట్ అవుతున్నా భారీస్థాయిలో ఆ సినిమాలు కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.
లవ్ స్టోరీ మూవీ చైతన్య కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గానిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏపీలో టికెట్ రేట్లు ఈ నెల 24వ తేదీ నాటికి పెరుగుతాయని చైతన్య ఫ్యాన్స్ భావించినా ఆ సమయానికి టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయంలో లవ్ స్టోరీకి నిరాశ తప్పదని తెలుస్తోంది. తెలంగాణలో ఎటువంటి ఆంక్షలు లేకపోవడం లవ్ స్టోరీ సినిమాకు ప్లస్ అవుతోంది.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లలో టికెట్ ధర 150 రూపాయలు కాగా మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర 200 రూపాయలకు అటూఇటుగా ఉంది. చైతన్య, సాయిపల్లవితో శేఖర్ కమ్ముల మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.