Allu Arjun: పుష్ప ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

పుష్ప ది రైజ్ సినిమాకు రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో స్టార్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. రిలీజైన 21 రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమాను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. థియేట్రికల్ వెర్షన్ లో లేని సీన్లు డిజిటల్ వెర్షన్ లో ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమా రన్ టైమ్ 175 నిమిషాలుగా ఉంది. ఓటీటీ వెర్షన్ లో మేకర్స్ అనవసరమైన సీన్స్ ను తొలగించడంతో పాటు కొత్త సన్నివేశాలను జోడించారు. ఈ విషయాలను ముందే వెల్లడించకుండా బన్నీ అభిమానులకు పుష్ప మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి. ఓటీటీలో కూడా పుష్ప మూవీ రికార్డులు సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. సమంత పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

పుష్ప సినిమా ఓటీటీ వెర్షన్ లో సమంత పాటకు సంబంధించిన విజువల్స్ ను కూడా యాడ్ చేశారని బోగట్టా. భారీ మొత్తం చెల్లించి పుష్ప ది రైజ్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా ద్వారా బాగానే గిట్టుబాటు అయ్యే ఛాన్స్ ఉంది. గతేడాది కొన్ని తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ కు భారీ నష్టాలను మిగిల్చాయి. 2022 సంవత్సరంలో మాత్రం పుష్ప సినిమాను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కు బాగానే ప్రయోజనం చేకూరనుంది.

తెలుగులో చాలామంది హీరోలకు ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప మూవీతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారనే చెప్పాలి. వరుసగా విజయాలను అందుకుంటున్న బన్నీ పుష్ప ది రూల్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ ఏడాది సెకండాఫ్ లో పుష్ప ది రూల్ రిలీజ్ కానుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus