దేవర రిలీజ్ రోజున ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పనున్న బాలయ్య.. ఏమైందంటే?

ఈ నెల 27వ తేదీన దేవర (Devara) మూవీ రిలీజ్ అవుతుండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేవర సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో వేగం పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దేవరపై (Devara) ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మొదట ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడినా యు/ఎ సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

Devara

అయితే ఈ నెల 27వ తేదీన అన్ స్టాపబుల్ షో షూట్ కూడా మొదలుకానుందని సమాచారం అందుతోంది. 27వ తేదీతో పాటు 28వ తేదీని సైతం పరిశీలిస్తున్నారని ఆ రెండు రోజుల్లో ఒకరోజు అన్ స్టాపబుల్ షో షూట్ తో బాలయ్య మరోసారి ఓటీటీలో సందడి చేయనున్నారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్1, అన్ స్టాపబుల్ సీజన్2 హిట్ కాగా గతేడాది ఈ షోకు సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో కొన్ని ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి.

అన్ స్టాపబుల్ సీజన్3 పేరుతో ఈ సీజన్ ప్రసారమయ్యే ఛాన్స్ ఉంది. నందమూరి హీరోలు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో పాటు బాలయ్య షోల ద్వారా కూడా బిజీ కావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. దసరా పండుగ నుంచి బాలయ్య (Balakrishna)  బాబీ  (Bobby)  కాంబో మూవీ షూటింగ్ అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ సినిమా సంక్రాంతి రేసులో కచ్చితంగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య పారితోషికం ఏకంగా 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఒక్కో సినిమాకు బాలయ్య ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఒక్క ఫ్లాప్‌ అంత చేటు చేస్తుందా? సినిమాలు వచ్చిన్లే వచ్చి.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus