సినిమాలు ఓకే అవ్వడం చాలా ఈజీ… క్యాన్సిల్ అవ్వడం చాలా కష్టం అంటుంటారు. కానీ టాలీవుడ్ ప్రజెంట్ సిట్యువేషన్ చూస్తుంటే రెండోది కూడా ఈజీ అయిపోయిందా అని అనిపిస్తోంది. కారణంగా వరుసగా తెలుగు సినిమాలు క్యాన్సిల్ అనే లీకులు/పుకార్లు వినిపిస్తుండటమే. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత నిజమయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ – కొరటాల సినిమా విషయంలో ఇలాంటి పుకార్లే మొదలయ్యాయి. అది మరచిపోక ముందే మరో సినిమా వార్తల్లోకి వచ్చింది.
సుమారు ఏడు నెలల క్రితం సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ స్నేహితుడు కేదార్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుందని చెప్పారు. ఆ తర్వాత సినిమా గురించి ఎక్కడా చర్చ లేదు. ఓవైపు విజయ్ ‘లైగర్’ షూటింగ్‌లోను, మరోవైపు సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్‌లోనూ బిజీగా ఉండటం వల్ల వాళ్ల కాంబో గురించి ఎక్కడా, ఏమీ మాట్లాడటం లేదేమో అనుకున్నారు. అయితే ఈ సినిమా ఆలోచనను విరమించుకునే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్ గాసిప్.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో సరైన స్పష్టత లేదు. సుకుమార్ అయితే రామ్‌చరణ్‌తో సినిమా చేస్తాడని వార్తలు అప్పుడే మొదలయ్యాయి. ‘రంగ స్థలం’ తర్వాత వారి కాంబో మరో సినిమా వస్తుందని అప్పుడే వార్తలొచ్చాయి. ఆ సినిమా ఇదే అని టాక్. అయితే విజయ్ దేవరకొండ సినిమా ఎందుకు ఆగిపోయిందనేది తెలియదు. అయితే సినిమా ఆగిపోలేదని, వాయిదా మాత్రమే పడిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!