Mahesh Babu: మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా?

స్టార్ హీరో మహేష్ బాబు సర్కారు వారి ట్రైలర్ తో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ పోకిరి, గీతా గోవిందం సినిమాలను కలిపితే సర్కారు వారి పాట అని కామెంట్ చేశారు. సర్కారు వారి పాట ట్రైలర్ ను చూస్తే ఆయన చేసిన కామెంట్లు నిజమేనని అర్థమవుతోంది. యూట్యూబ్ లో సర్కారు వారి పాట ట్రైలర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ కు దాదాపుగా 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గతంలో 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ రికార్డ్ రాధేశ్యామ్ సినిమాపై ఉంది. రాధేశ్యామ్ సినిమాకు ఒక్కరోజులో ఏకంగా 23.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఆ రికార్డును ఈ సినిమా సులభంగానే బ్రేక్ చేయడం గమనార్హం. మహేష్ ఖాతాలో అరుదైన రికార్డులు చేరడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ ట్రైలర్ తో సౌత్ లోని కొన్ని సినిమాల రికార్డులను సైతం మహేష్ బ్రేక్ చేశారు.

మరోవైపు సినిమాసినిమాకు మహేష్ బాబు మరింత అందంగా కనిపించారు. 46 సంవత్సరాల వయస్సులో కూడా కాలేజ్ కుర్రాడిలా మహేష్ బాబు కనిపిస్తుండటం గమనార్హం. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపించడంతో పాటు ఆయన క్యాస్టూమ్స్ కూడా కొత్తగా ఉండటం గమనార్హం. మహేష్ కెరీర్ లోనే సర్కారు వారి పాట బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే సమ్మర్ హాలిడేస్ కూడా కలిసొచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

దాదాపుగా 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus