Prabhas: సలార్ టీజర్ తో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో క్రేజ్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ లతో ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సలార్ మూవీ టీజర్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. సలార్ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఈ టీజర్ కు కేవలం ఆరు గంటల్లో 1 మిలియన్ లైక్స్ రావడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ టీజర్ ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడానికి 36 గంటల సమయం పట్టిందని భోగట్టా. బన్నీ సినిమా టీజర్ ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడానికి 2 రోజుల 11 గంటల సమయం పట్టగా మహేష్ బాబు సినిమా టీజర్ ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడానికి 18 రోజుల సమయం పట్టింది. సలార్ మూవీకి సంబంధించి భాషతో సంబంధం లేకుండా ఒకే టీజర్ రిలీజ్ కావడంతో ఈ రికార్డ్ సాధ్యమైంది.

టీజర్ లో ప్రభాస్ (Prabhas) కనిపించింది కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా ఆ షాట్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ టీజర్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిమిష నిమిషానికి మిలియన్లలో వ్యూస్ కౌంట్ పెరుగుతుండటం గమనార్హం. యూట్యూబ్ సలార్ టీజర్ సరికొత్త సంచలనాలను సృష్టిస్తోంది.

సలార్ ప్రభంజనం చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. టాక్ తో సంబంధం లేకుండా రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో శృతి హాసన్ నటించగా శృతి హాసన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. సలార్ సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus