Prabhas: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఈ హీరోకే సాధ్యమంటూ?

స్టార్ హీరో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో మరీ భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ లో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో రజనీకాంత్, మహేష్ సాధించిన రికార్డులను సైతం ఆదిపురుష్ తో ప్రభాస్ బ్రేక్ చేయడం గమనార్హం. ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆదిపురుష్ మూవీ కలెక్షన్ల ద్వారా ఓవర్సీస్ లో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరడం గమనార్హం. మహేష్, రజనీ నటించిన సినిమాలు ఓవర్సీస్ లో ఎక్కువగా 2 మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించాయి. ఈ జాబితాలో మహేష్ సినిమాలు 4 ఉండగా రజనీ సినిమాలు కూడా 4 ఉండటం గమనార్హం. ప్రభాస్ మాత్రం ఆదిపురుష్ సినిమాతో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుని ఈ జాబితాలో తన సినిమాలు 5 ఉండేలా రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ రాబోయే రోజుల్లో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని ఇందుకు సంబంధించి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ గమనార్హం. ప్రభాస్ ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ సినిమాలన్నీ అరుదైన రికార్డులను క్రియేట్ చేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రభాస్ (Prabhas) సినిమాలన్నీ 300 నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు, మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కు భవిష్యత్తులో వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus