Nagarjuna: బంగార్రాజు కథపై ఈ రూమర్ నిజమేనా?

అక్కినేని నాగార్జున సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సోగ్గాడే చిన్నినాయన ఒకటనే సంగతి తెలిసిందే. నాగార్జున ఈ సినిమాతో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించారు. సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన మూవీతో రికార్డులు క్రియేట్ చేశారు. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది. 2022 సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ బంగార్రాజు సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త నెట్టింట జోరుగా ప్రచారంలోకి వస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం బంగార్రాజు మూవీలో బంగార్రాజు పాత్రతో పాటు బంగార్రాజు మనవడి పాత్ర కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చైతన్య కొడుకుగా నాగార్జున నటిస్తున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సినిమాలో బంగార్రాజు పాత్ర, బంగార్రాజు మనవడి పాత్ర మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున బంగార్రాజు సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న నాగచైతన్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video



రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus