మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి రెడీ అయ్యారు!

సినిమాలో ఒక్కో ఫ్రేమ్‌ కోసం దర్శకుడు, హీరో చాలా కష్టపడతారు. అంటే మిగిలిన వాళ్లు కష్టపడరని కాదు. ఇప్పుడు హీరో, దర్శకుడు కోసమే మాట్లాడుతున్నాం కాబట్టి… వాళ్ల గురించే చెప్పాం. అలాంటి ఫ్రేమ్‌తో పోస్టర్‌ను విడుదల చేస్తే… దానిని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. అలాంటి ఓ ఫ్రేమ్ ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో వచ్చింది. అదే మోహన్‌లాల్‌ – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా పోస్టర్‌. ‘బ్రో డాడీ’ పేరుతో ఇద్దరూ ఓ సినిమా చేశారు. దాని పోస్టరే ఇది.

మోహన్‌ లాల్‌ అంటే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన గతంలో చాలా సార్లు చెప్పాడు కూడా. ఆ ఇష్టాన్ని ‘లూసిఫర్‌’ సినిమాలో సన్నివేశాలుగా చూపించాడు కూడా. సినిమాలో ఒక్కో ఫ్రేమ్‌ ఒక్కో అద్భుతం అని అదేదో సినిమా డైలాగ్‌ చెప్పినట్లు… ‘లూసిఫర్‌’లో మోహన్‌లాల్‌ ఎలివేషన్‌ సీన్లు అలా ఉంటాయి మరి. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఏ స్థాయి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ విజయమే ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో ‘గాడ్‌ఫాదర్‌’గా చిరంజీవి చేయడానికి కారణం.

ఇప్పుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ మరోసారి మోహన్‌ లాల్‌ను తనదైన శైలిలో చూపించడానికి సిద్ధమయ్యాడు. అదే ‘బ్రో డాడీ’. టైటిల్‌తోనే సినిమా మీద ఆసక్తి పెంచేసిన పృథ్వీరాజ్‌ ఇప్పుడు పోస్టర్‌తో దాన్ని రెట్టింపు చేశాడు. కలర్‌ ఫుల్‌ బ్యాగ్రౌండ్‌లో మోహన్‌ లాల్‌ – పృథ్వీరాజ్‌ ఉన్న ఆ పోస్టర్‌ ఆ ఇద్దరి ఫ్యాన్స్‌కి పండగే. మనకు కూడా అంతే అనుకోండి. ఈ సినిమాలో అన్నయ్య లాంటి తండ్రికి, స్నేహితుడు లాంటి కొడుకు మధ్య బంధాన్ని చూపిస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమాను నేరుగా కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. వచ్చే జనవరి 26న సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను పృథ్వీరాజ్‌ నిర్మాతల్లో ఒకరు కూడా. అన్నట్లు మోహన్‌లాల్‌ నటిస్తూ, తెరకెక్కిస్తున్న ‘బారోజ్‌’లో పృథ్వీరాజ్‌ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు కూడా. అలా ఒకరి సినిమాల్లో ఒకరు నటించడం వాళ్లకెంత ఆనందమో మనకు తెలియదు కానీ, అభిమానులకు మాత్రం సంతోషమే. ఇలాంటి ఫ్రేమ్‌లు మన దగ్గర కూడా వస్తేనా?…

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus