Ooru Peru Bhairavakona Collections: ‘ఊరు పేరు భైరవకోన’ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • February 19, 2024 / 10:18 AM IST

సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొందింది. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ లభించింది.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. గతంలో సందీప్ కిషన్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘టైగర్’ అనే మూవీ వచ్చింది.

అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. అందుకే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది అని చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.52 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.23 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.12 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.17 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.25 cr (షేర్)

‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమాకు రూ.9.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.9.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా ప్రీమియర్స్ తో కూడా కలుపుకుని రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.7.6 కోట్లు షేర్ ను రాబట్టాలి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus