ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని హీరోలలో సందీప్ కిషన్ ఒకరు కాగా ఊరి పేరు భైరవకోన అనే టైటిల్ తో సందీప్ సినిమా ఒకటి తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 27 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. రాజేష్ దండా ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.
అయితే ఈ సినిమాకు రిలీజ్ కు ముందే హక్కుల ద్వారా 2 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలుస్తోంది. ఊరి పేరు భైరవకోన మూవీ థియేట్రికల్ హక్కులు 14 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నాన్ థియేట్రికల్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. థియేట్రికల్ హక్కులను వీ3 ఎంటర్టైన్మెంట్స్ ను సొంతం చేసుకోగా నాన్ థియేట్రికల్ హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతమయ్యాయి.
సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా వీఐ ఆనంద్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఊరి పేరు భైరవకోన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ కిషన్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉండగా ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.
వీఐ ఆనంద్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సందీప్ కిషన్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సందీప్ కిషన్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈగల్, లాల్ సలామ్ సినిమాలు సైతం అదే తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. విరూపాక్ష మూవీ తరహా మ్యాజిక్ ను ఈ సినిమా (Ooru Peru Bhairavakona) రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!