ఉగాది కానుకగా మార్చి 25న ఒరేయ్‌ బుజ్జిగా!

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – “ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా బేన‌ర్‌లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు త‌ప్ప‌కుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25 ఈచిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం” అన్నారు. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus