ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల సందడి మొదలైపోయింది. 98వ ఆస్కార్ నామినేషన్ల జాబితాను అకాడెమీ అవార్డ్స్ కమిటీ అనౌన్స్ చేసింది. ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలు, భారీగా ఆదరణ అందుకున్న ‘సిన్నర్స్’ సినిమా ఏకంగా 16 నామినేషన్లతో రికార్డు స్థాయిలో నామినేషన్లలో చోటు సంపాదించింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్ తదితర విభాగాల్లో నామినేషన్లలో నిలిచింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు 14 నామినేషన్లతో ‘ఆల్ అబౌట్ ఈవ్’, ‘టైటానిక్’, ‘లాలా ల్యాండ్’ సినిమాల పేరు మీద ఉండేది. ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న ఆస్కార్ వేడుక జరగనుంది. అన్నట్లు మన దేశం నుండి అధికారికంగా ఆస్కార్‌కి వెళ్లిన ‘హోమ్‌బౌండ్’కు నిరాశే ఎదురైంది.
* ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘బగోనియా’, ‘ఎఫ్-1’, ‘ఫ్రాంకిన్‌స్టన్’, ‘హ్యామ్‌నెట్’, ‘మార్టీ సుప్రీం’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘ది సీక్రెట్ ఏజెంట్’, ‘సెంటిమెంటల్ వాల్యూ’, ‘సిన్నర్స్’, ‘ట్రైన్ డ్రీమ్స్’ సినిమాలు నిలిచాయి.
* ఉత్తమ దర్శకత్వం విభాగంలో క్లోయి జావ్ (హ్యామ్‌నెట్), జాష్ షాఫ్డీ (మార్టీ సుప్రీం), పాల్ థామస్ ఆండ్రసన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), యో ఆకీమ్ ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ), రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్) బరిలో నిలిచారు.
* ఉత్తమ నటుడు అవార్డు కోసం తిమోతి చాలమేట్ (మార్టీ సుప్రీం), లియోనార్డ్ డికాప్రియో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ఈథన్ హాక్ (బ్లూ మూన్), మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్), వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్) పోటీపడనున్నారు.
* ఉత్తమ నటి పురస్కారం కోసం జెస్సీ బక్లీ (హ్యామ్ నెట్), రోజ్ బర్న్ (ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు), కేట్ హడ్సన్ (సాంగ్ సంగ్ బ్లూ), రెనాటా రైన్సావా (సెంటిమెంటల్ వాల్యూ), ఎమ్మా స్టోన్ (బగోనియా) బరిలో ఉన్నారు.
* బెనిసియో డెల్ టారో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), జేకబ్ ఎల్రోడి (ఫ్రాంకిన్‌స్టన్), డెల్రాయ్ లిండో (సిన్నర్స్), షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), స్టెలెన్ స్కార్స్‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ) ఉత్తమ సహాయ నటుడు అవార్డు కోసం పోటీలో ఉంటారు.
* ఉత్తమ సహాయ నటి అవార్డు కోసం ఎల్ ఫ్యానింగ్ (సెంటిమెంటల్ వాల్యూ) ఇంగా ఇబ్సిడాట్టర్ లిల్లాస్ (సెంటిమెంటల్ వాల్యూ), ఎమీ మాడిగన్ (వెపన్స్), ఉన్మి మసాకు (సిన్నర్స్), టియానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) పోటీ పడుతున్నారు.
* ఉత్తమ అంతర్జాతీయ చిత్రం పురస్కారం కోసం ‘ది సీక్రెట్ ఏజెంట్’ (బ్రెజిల్), ‘ఇట్ వాజ్ ఏ జస్ట్ యాక్సిడెంట్’ (ఫ్రాన్స్), ‘సెంటిమెంటల్ వాల్యూ’ (నార్వే), ‘సిరాట్’ (స్పెయిన్), ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్’ (తునీషియా) పోటీలో ఉన్నాయి.