మన నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న పొరుగు హీరోలు!

పొరుగింటి పుల్లగూర రుచి… ఈ సామెతను మీరు వినే ఉంటారు. టాలీవుడ్‌లో అయితే హీరోయిన్లకు సంబంధించి ఈ సామెత మా సీనియర్‌ రైటర్లు చాలాసార్లు రాసి రాసి పెన్నులు అరిగిపోయుంటాయి. కొత్త ట్రెండ్‌ ప్రకారం ఈ సామెత హీరోయిన్లకు కాకుండా హీరోలు, నటులకు వాడొచ్చు అనిపిస్తోంది. కారణం మన దర్శకులు, నిర్మాతలు… మనవాళ్లను కాదని పొరుగు హీరోలను ఎంచుకుంటున్నారు. తీరా సినిమా స్టార్ట్‌ అయ్యాక అసలు రుచి బయటికొస్తోందట. టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ట్రెండ్‌… పాన్‌ ఇండియా.

దీని కోసం మన నిర్మాతలు మన హీరోలను కాకుండా కోలీవుడ్‌ హీరోలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలా కొన్ని సినిమాలు అనౌన్స్‌మెంట్‌లు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అసలు సంగతి బయటికొస్తోందట. ఇతర భాషల నటులు వచ్చి… గొంతెమ్మ కోర్కెల‌తో మ‌న నిర్మాత‌ల్ని ఇబ్బందులు పెడుతున్నారట. రీసెంట్‌గా త‌మిళ హీరోతో.. తెలుగు నిర్మాత ఓ సినిమా చేయ‌డానికి డీల్ కుదుర్చుకున్నారు. భారీ పారితోషికం కూడా ఇవ్వడానికి ఓకే అయ్యారు. అంతా ఓకే అయ్యింది.

పారితోషికంతోపాటు ఆ హీరో చేసిన డిమాండ్లు ఇప్పుడు నిర్మాత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. తన పారితోషికానికి… తన టీమ్‌కి జీతభ‌త్యాలు యాడ్‌ చేశారట. అంటే ఆయన టీమ్‌ జీతాలకు సరిపడా డబ్బును కూడా నిర్మాతనే ఇవ్వాలని అడిగాడట. దీంతో నిర్మాత పరిస్థితి అయోమయం అయ్యిందట. మన హీరోలను వదిలి వేరే హీరోలతో సినిమా ఎందుకు చేశావు అని అడగలేం కానీ… ఇలాంటి పితలాటకాలు పెట్టే హీరోలు ఎందుకు అని అడగొచ్చుగా. మనమెందుకు ఇప్పటికే ఆ నిర్మాత మిత్రులు అడుగుతున్నారట.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus