ఓటీటీ కొత్త రూల్స్!

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన సమయంలో ఓటీటీల హవా పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ విడుదల కాని సినిమాలు సైతం ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. ఓ రకంగా నిర్మాతలను ఒడ్డున పడేశాయి. అయితే ఆరంభంలో చిన్న సినిమాలను కొనేసి ఓటీటీలు.. వాటి వలన ఏ ప్రయోజనం లేదని తెలుసుకొని ఇప్పుడు అలర్ట్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు చిన్న సినిమాలను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. స్టార్ కాస్టింగ్ లేకపోతే వాటిని పట్టించుకోవడం లేదు.

కొంతమంది నిర్మాతలు ముందే ఒప్పందాలు చేసుకోవడంతో ఓటీటీల్లో చిన్న సినిమాలు కొన్ని అయినా.. కనిపిస్తున్నాయి. కానీ వాటిని ఓటీటీలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఇటీవల కొన్ని సినిమాలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో కనిపించాయి. అయితే వాటికి రావాల్సిన ఫండ్స్ ఇప్పటివరకు ఆయా ఓటీటీ సంస్థలు విడుదల చేయలేదు. చాలా తక్కువ మొత్తానికి సినిమా కొన్నప్పటికీ.. మూడు వాయిదాలలో ఆ డబ్బులను చెల్లిస్తున్నాయి. ఆ మూడు వాయిదాలు కూడా.. ఓటీటీల ఇష్టమే. స‌బ్ స్క్రైబ‌ర్లు సినిమాను ఫ్రీగా చూసినా.. నిర్మాతలకు మాత్రం పే పర్ వ్యూ పద్దతిలో చెల్లిస్తున్నారు.

ఎంతమంది చూస్తే ఆ లెక్కన డబ్బులు పే చేస్తున్నారు. ఓటీటీ ద్వారా ఎంతోకొంత తిరిగి వస్తుందని ఆశిస్తోన్న చిన్న నిర్మాతలకు నిరాశే ఎదురవుతోంది. ఓటీటీలకు సినిమాను ఇచ్చేసి.. వాళ్ల నుండి డబ్బులు రాక, ఇప్పుడు ఆ సినిమాలను థియేటర్లో విడుదల చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ఈ ప్రభావం పెద్ద సినిమాలపై కూడా పడుతోంది. ఇంతకముందు పెద్ద సినిమాలను సింగిల్ పేమెంట్ లో సెటిల్ చేసిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు వాళ్లకి కూడా మూడు వాయిదా పద్దతిలో చెల్లిస్తున్నారట. అంతేకాదు.. సినిమా చూసిన తరువాతే కొంటాం అంటూ కొత్త రూల్ పెడుతున్నారట. మొత్తానికి ఓటీటీలకు సినిమాను అమ్మడం కూడా నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus